1. ఈ సర్వేలో అత్యంత ప్రధానమైనది కుటుంబాలను గుర్తించడం. ( Nov: 1 - 3 )
2. మీరు హౌస్ లిస్టింగ్ కు వెళ్ళినప్పుడే ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయి అనేది నిర్ణయించండి. ఇంటి పెద్ద ఇచ్చిన సమాచార ఆధారంగా ఇంట్లోని పరిస్థితుల దృష్ట్యా కుటుంబాల సంఖ్యను గుర్తించండి.
3. ఉమ్మడిగా ఉన్నటువంటి కుటుంబాలు *ఇలాంటి సర్వే సమయంలో విడివిడిగా రాయించుకోవడానికి మొగ్గు చూపుతారు*. కావున వారిచ్చిన సమాచార ఆధారంగా కుటుంబాలను నిర్ణయించండి.
4. సర్వే మొదలుపెట్టిన తర్వాత కొత్త కుటుంబం తెరపైకి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోండి.
5. హౌస్ లిస్టింగ్ సమయంలో ఎన్ని కుటుంబాల వివరాలు రాయాలో తెలుసుకుని ఆ కుటుంబ పెద్దలు సర్వే సమయంలో అందుబాటులో ఉండేలా చూడమని చెప్పండి. వారి యొక్క ఆధార్ కార్డుల సమాచారం, ధరణి, రేషన్ కార్డ్ తప్పకుండా ఉండాలని చెప్పండి.
5. *ప్రభుత్వ పథకాలు సజావుగా అందరికీ చేరాలంటే ఈ సమాచారం అత్యంత ముఖ్యమైనదని* వారికి తెలియజేయండి.
6. హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ *యజమానుల ఫోన్ నెంబర్లు తీసుకోండి. సర్వే మీకు చాలా సులభం అవుతుంది*.
7. మీరు వెళ్లిన సమయంలో ఇల్లు తాళం వేసి ఉంటే పక్కన ఉన్నవారికి తెలియజేసి సర్వే సమాచారం చెప్పమనండి.
మీ ఎన్యుమరేషన్ బ్లాక్ లో అన్ని కుటుంబాలను గుర్తించిన తర్వాత సర్వే ప్రారంభించండి.( Nov: 6 - 18 ). *ina*
8. సర్వే రోజు ఆ ఇంటికి వెళ్ళగానే ఆ కుటుంబంలో సరియైన సమాచారాన్ని వివరంగా ఎవరు చెబుతారో వారిని పిలవండి. కుటుంబ సభ్యుల *ఆధార్ కార్డులను* తీసుకొని ఆధార్ కార్డులో ఉన్న సమాచారాన్ని పూర్తిగా నమోదు చేసుకోండి.
*పేరు, వయసు, ఆధార్ సంఖ్య*... మొబైల్ నెంబర్
9. *మొదటిరోజు సర్వేను నిదానంగా చేస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా యజమానిని అడిగి వివరాలు రాసుకోండి*.
9. మొదటి రోజు *రెండు లేదా మూడు సర్వే పారాలను పెన్సిల్ తో రాసుకోండి*. దీనివలన ఏ అంశాలలో *తప్పులు జరుగుతున్నాయో* మీకు సులభంగా తెలుస్తుంది.
10. ఒక కుటుంబంలో పదిమంది కంటే ఎక్కువ సభ్యులు ఉన్నట్లయితే *రెండవ ఫారాన్ని నింపండి*. ఉమ్మడి కుటుంబంలో ఫారం నింపేటప్పుడు యజమాని, అతని భార్య పెద్దకొడుకు, అతని భార్య పిల్లలు/ చిన్న కొడుకు అతని భార్య, పిల్లలు వరుస క్రమంలో రాసుకోండి. ఇలా చేస్తే యజమానితో *బంధుత్వం మీరు సులభంగా రాయగలుగుతారు*. సమయం ఆదా అవుతుంది.
11. *కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వారందరికీ కూడా ప్రతీ కాలం లోని వివరాలు అడిగి పూరించాలి*.
12. 20వ, కాలంలో వివరాలను నింపినట్లైతే *21,22,23,24 లో* సమాచారం నమోదు చేయాలి. 20వ కాలం ఖాళీగా ఉన్నట్లయితే మిగిలిన పూరించవలసిన అవసరం లేదు.
13. ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పినట్లయితే *ఆదాయపన్ను* చెల్లిస్తారు గమనించగలరు. ప్రయివేటు పనులు, వ్యాపారస్తులు కూడా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా అడగండి.
14. 43 వ, కాలం a, b, c చాలా ముఖ్యమైన అంశాలు. *పెన్షన్, రైతు బంధు, కల్యాణలక్ష్మి, ప్రభుత్వ ఇల్లు, స్కాలర్ షిప్స్, సిఎం సహాయ నిధి, రుణమాఫీ, రైతు భీమా, ఆరోగ్యశ్రీ, గొర్రెల పంపిణీ, చేనేత, దళిత బంధు*
15. 46( a) నుండి 46(f) *రాజకీయ పరమైనవి అంశాలు*, కొంతమందికి మాత్రమే ఉంటాయి గమనించగలరు.
16. 48వ, కాలం *వలసకు సంబంధించింది ( ఇతర రాష్ట్రం, ఇతర దేశం )*
మీ కుటుంబంలో మీ పిల్లలు *ఉన్నత చదువు, ఉద్యోగం, పెళ్లి , వ్యాపారం, కోసం వలస వెళితే* వారి వివరాలు, వారు వెళ్లిన దేశం, లేదా రాష్ట్రం వివరాలు. 48(a), 48(b), 48(c), 48(d) రాయాలి.
*వలస వెళ్లనట్లయితే ఈ కాలమ్స్ నింపవలసిన అవసరం ఉండదు*.
👉 *చివరలో యజమానితో సంతకం పెట్టించండి*.
ధన్యవాదాలు......
~ *in school activities*
Please give your comments....!!!