ముఖ్య గమనిక: అపార్ కార్డులో విద్యార్థుల ఫోటోలు ఆటోమేటిగ్గా వస్తున్నాయి అనగా ఆధార్ కార్డులో ఏదైతే ఫోటో ఉందో అదే ఫోటో వస్తుంది ఉదాహరణకు ఐదో తరగతి చదివి విద్యార్థి తన పుట్టినప్పుడు ఆధార్ కార్డు తీసి ఉంటే ఇప్పుడు ఆ పార్క్ కార్డు కోసం ఆన్లైన్ చేస్తే అదే ఫోటో వస్తుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో విద్యార్థులకు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాల్సిందిగా చెప్పవలెను. అపార్ కార్డు డౌన్లోడ్ చేసేముందు విద్యార్థి యొక్క ఆధార్ కార్డుకు లింకు ఉన్న మొబైల్ నెంబర్ కు ఓటిపి నమోదు చేయడం ద్వారా మాత్రం డౌన్లోడ్ చేయొచ్చు అనగా విద్యార్థి యొక్క ఆధార్ కార్డుకు లింకు ఉన్న మొబైల్ నెంబర్ ఇప్పుడు వర్కింగ్ లో ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవాలి ఒకవేళ లేకపోతే అప్డేట్ చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులకు చెప్పాల్సి ఉంటుంది.
ఇక్కడ క్లిక్ చేసి UDISE plus website open చేయండి.
ఈ పనిని అతి సులభంగా ఫోన్ లో కూడా చేసుకోవచ్చు
మీ స్కూల్ యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఈ క్రింది విధంగా కనబడుతుంది అందులో ప్రస్తుత అకాడమిక్ ఇయర్ ను సెలెక్ట్ చేసుకోండి
అకాడమిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్రింది విధంగా డిస్ప్లే అవుతుంది అందులో లెఫ్ట్ సైడ్ మూల పైన ఉన్న బాణం గుర్తు మీద టచ్ చేయండి
ఇప్పుడు మెనూ కనబడుతుంది
APAAR Module ను సెలెక్ట్ చేసుకోండి.
తరగతి మరియు సెక్షన్ ను సెలెక్ట్ చేసుకోండి
ఇప్పుడు మీరు ఎంచుకున్న తరగతిలోని విద్యార్థుల పేర్లు కనబడతాయి అందులో మీరు ఏ విద్యార్థి యొక్క కార్డ జనరేట్ చేయాలనుకుంటున్నారో వారి పేరు మీద కుడివైపు వెళ్ళండి అక్కడ జనరేట్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి
జనరేట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ క్రింది విధంగా కనబడుతుంది అందులో విద్యార్థి యొక్క వివరాలు ఉంటాయి అవి సరిగా ఉన్నాయా లేదో చూసుకోండి ఒకవేళ సరిగా లేకపోతే మళ్లీ అప్డేట్ చేయవచ్చు ఇక్కడనే
సరిగా ఉన్నాయి అని నిర్ధారించుకున్న తర్వాత తల్లిదండ్రుల అంగీకార లేదా సమ్మతి పత్రం కాన్సెంట్ఫామ్ మీద ఎవరైతే సిగ్నేచర్ చేస్తారో వారి యొక్క పేరు వాళ్ళ ఐడెంటి కార్డు నంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది
నమోదు చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి మీ రిక్వెస్ట్ తీసుకోవడం జరుగుతుంది ఇలా చేసిన తర్వాత కార్డ్ జనరేట్ కావడానికి సుమారుగా 24 గంటలు సమయం పడుతుంది.
Please give your comments....!!!