1) లారేన్సియా
2) అంగారా
3) గోండ్వానా
4) లారేన్సియా, గోండ్వానా
2. భారతదేశ ప్రామాణిక రే ఖాంశం ఏది?
1) 23½º తూర్పు రేఖాంశం
2) 23½º పశ్చిమ రేఖాంశం
3) 82½º తూర్పు రేఖాంశం
4) 82½º పశ్చిమ రేఖాంశం
3. భారతదేశం ఉనికి పరంగా ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
1) 68º7¹ నుంచి 97º 25¹ తూర్పు అక్షాంశాల మధ్య
2) 8º 4¹ నుంచి 37º 6¹ ఉత్తర అక్షాంశాల మధ్య
3) 8º 4¹ నుంచి 97º 25¹ ఉత్తర అక్షాంశాల మధ్య
4) 68º 7¹ నుంచి 97º 25¹ ఉత్తర అక్షాంశాల మధ్య
4. జతపరచండి.
తీరం రాష్ర్టం
1. సర్కార్ తీరం ఎ. తమిళనాడు
2. కోరమండల్ బి. ఆంధ్రప్రదేశ్
3. వంగతీరం సి. ఒడిశా
4. ఉత్కళ్ తీరం డి. పశ్చిమబెంగాల్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి. 4-సి
4) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
5. మహానది డెల్టా ఏ రాష్ర్టంలో ఉంది?
1) ఒడిశా
2) పశ్చిమబెంగాల్
3) ఆంధ్రప్రదేశ్
4) తమిళనాడు
6. మన దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది?
1) కాకతీయ కాలువ
2) ఇందిరా గాంధీ కాలువ
3) తెలుగు గంగ కాలువ
4) జవహర్ నెహ్రూ కాలువ
7. కింది వాటిలో సరికానిది ఏది?
1) మలబార్ తీరం - కేరళ
2) కెనరా తీరం - కర్ణాటక
3) కొంకణ్ తీరం - మహారాష్ర్ట
4) కాండ్లా తీరం - గోవా
8. కావేరి డెల్టా ఏ రాష్ర్టంలో విస్తరించి ఉంది?
1) కర్ణాటక
2) కేరళ
3) తమిళనాడు
4) ఆంధ్రప్రదేశ్
9. కింది వాటిలో సరికానిది ఏది?
1) లక్ష ద్వీప దీవులు ప్రవాళ భిత్తికల (కోరల్) నుంచి ఏర్పడ్డాయి.
2) భారత దేశ దక్షిణ చివరి ప్రాంతాన్ని ‘ఇందిరా పాయింట్’ అని పిలుస్తారు
3) ఇందిరా పాయింట్ అండమాన్ దీవుల్లో ఉంది
4) నార్కొండం, బారెన్ అగ్ని పర్వతాలు అండమాన్ దీవుల్లో విస్తరించి ఉన్నాయి.
10. ‘చిల్కా సరస్సు’ ఏ రాష్ర్టంలో ఉంది?
1) హిమాచల్ ప్రదేశ్
2) రాజస్థాన్
3) గుజరాత్
4) ఒడిశా
11. థార్ ఎడారి ప్రధానంగా ఏ రాష్ర్టంలో విస్తరించి ఉంది?
1) రాజస్థాన్
2) ఉత్తర ప్రదేశ్
3) మధ్యప్రదేశ్
4) గుజరాత్
12. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. థార్ ఎడారి ‘ఆరావళి పర్వతాల వర్షచ్ఛాయ’ ప్రాంతంలో విస్తరించి ఉంది.
బి. థార్ ఎడారి ప్రాంతంలో సంవత్సర సగటు వర్షపాతం 100-150 సెం.మీ.ల మధ్య ఉంటుంది
సి. థార్ ఎడారి ప్రాంతంలో ప్రవహించే అంతస్థలీయ నది ‘లూని’ నది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
13. ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమాన ఉన్న సముద్రం ఏది?
1) బంగాళాఖాతం
2) అరేబియా సముద్రం
3) హిందూ మహాసముద్రం
4) ఎర్ర సముద్రం
14. దక్షిణ భారత దేశంలో ఎత్తైన శిఖరం ఏది?
1) దొడబెట్ట
2) అరోమకొండ
3) మహేంద్ర గిరి
4) అనైముడి
15. జతపరచండి.
పర్వత శ్రేణులు ప్రాంతం
1. ఫళని కొండలు ఎ. ఆంధ్రప్రదేశ్
2. అన్నామైలై బి. రాజస్థాన్
3. ఆరావళి పర్వతాలు సి. కేరళ
4. అరోమకొండ డి. తమిళనాడు
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
16. ‘మాక్‌డోక్ డింపెప్’ లోయ ఏ రాష్ర్టంలో ఉంది?
1) మేఘాలయా
2) అరుణాచల్‌ప్రదేశ్
3) సిక్కిం
4) మిజోరాం
17. కింది వాటిలో సరికానిది ఏది?
1) నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం దొడబెట్ట (2,637 మీటర్లు)
2) కార్డమం కొండలు తమిళనాడులో ఉన్నాయి
3) అనైముడి (2,695 మీటర్లు) శిఖరం ‘అన్నామలై’ పర్వతాల్లో ఉంది
4) ఊటి/ఉదక మండలం వేసవి విడిది కేంద్రం నీలగిరి పర్వతాల్లో ఉంది
18. పశ్చిమ తీర మైదానం వేటి మధ్య విస్తరించి ఉంది?
1) పశ్చిమ కనుమలు, బంగాళాఖాతం
2) బంగాళాఖాతం, తూర్పు కనుమలు
3) పశ్చిమ కనుమలు, అరేబియా సముద్రం
4) బంగాళాఖాతం, పశ్చిమ కనుమలు
19. కింది వాటిలో సరైంది ఏది?
ఎ. తూర్పు కనుమల కంటే పడమటి కనుమల ఎత్తు ఎక్కువ
బి. పశ్చిమ కనుమలు సుమారు 1,600 కి.మీ.ల పొడవున విస్తరించి ఉన్నాయి.
సి. దక్కన్ పీఠభూమి పశ్చిమం నుంచి తూర్పునకు వాలి ఉంది
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
20. పడమటి కనుమలు, నీలగిరి పర్వతాలు ఏ ప్రదేశంలో కలుస్తాయి?
1) చింతపల్లి
2) గుడలూరు
3) రాణ్ ఆఫ్ కచ్
4) కన్యాకుమారి
21. కింది వాటిలో పశ్చిమ కనుమల్లో భాగం కానిది ఏది?
1) అన్నామలై కొండలు
2) కార్డమం కొండలు
3) వెలి కొండలు
4) ఫళని కొండలు
22.అగ్ని పర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన నల్ల రేగడి నేలలు ఏ పీఠభూమిలో ప్రధానంగా కనిపిస్తాయి?
1) దక్కన్ పీఠభూమి
2) మాళ్వా పీఠభూమి
3) ఛోటా నాగపూర్ పీఠభూమి
4) భాగేల్‌ఖండ్ పీఠభూమి
23.థార్ ఎడారి ప్రాంతానికి నీరు అందించే కాలువ ఏది?
1) సర్‌హిందూ
2) మయురాక్షి
3) ఇందిరాగాంధీ
4) కె.సి. కెనాల్
24. కింది వాటిలో సరికానిది ఏది?
1) తూర్పు కనుమల సగటు ఎత్తు సుమారు 900 మీటర్లలోపు ఉంటుంది
2) తూర్పు కనుమలు ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు విస్తరించి ఉన్నాయి
3) నల్లమల, వెలికొండ, పాలకొండలు, శేషాచలం కొండలు తూర్పు కనుమల్లో భాగం
4) నర్మదానదికి దక్షిణాన ఉన్న ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి అని పిలుస్తారు.
25. మధ్య ఉన్నతభూములు (మాల్వా పీఠభూమి)లో తూర్పు వైపున ఉన్న పీఠభూమిని ఏమని పిలుస్తారు?
1) దక్కన్ పీఠభూమి
2) ఛోటా నాగపూర్ పీఠభూమి
3) బుందేల్‌ఖండ్ పీఠభూమి
4) భాగేల్‌ఖండ్ పీఠభూమి
26. ద్వీపకల్ప పీఠభూమి ఏ వైపున వాలి/వాలు ఉంది?
1) పశ్చిమం
2) దక్షిణం
3) తూర్పు
4) ఉత్తరం
27. ద్వీపకల్ప పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది?
1) పురాతన స్ఫటికాకార శిలలు
2) కఠినమైన అగ్నిశిలలు
3) రూపాంతర శిలలు
4) పైవన్నీ
28.‘భౌగోళికంగా మాల్వా పీఠభూమి’ వేటి మధ్య విస్తరించి ఉంది?
1) గంగా మైదానానికి దక్షిణాన
2) నర్మదా నదికి ఉత్తరాన
3) 1, 2
4) గంగా మైదానానికి ఉత్తరాన, హిమాలయాలకు దక్షిణాన
29.కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ అంచున ‘కన్యాకమారి’ ఉంది
బి. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్న పీఠభూమి ‘ఛోటా నాగపూర్’ పీఠభూమి
సి. సాత్పురా పర్వతాలు దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్నాయి
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
30. నర్మదా నదికి దక్షిణాన ఉన్న పీఠభూమి ఏది?
1) దక్కన్ పీఠభూమి
2) మాల్వా పీఠభూమి
3) ఛోటా నాగపూర్ పీఠభూమి
4) బుందేల్‌ఖండ్
31. దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దుగా ఉన్న పర్వతాలు ఏవి?
1) ఆరావళి పర్వతాలు
2) మహదేవ్ కొండలు
3) కైమూర్ శ్రేణులు
4) నీలగిరి పర్వతాలు
32. కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి
.ఎ. హిమాలయాలు పడమర నుంచి తూర్పునకు సుమారు 2,400 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి
బి. ఇవి సుమారు 500 - 200 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉన్నాయి
సి. వీటిలో సమాంతరంగా ఉండే 5 పర్వత శ్రేణులు ఉన్నాయి
1) ఎ, బి
2) బి, సి
3) ఎ, సి
4) ఎ, బి, సి
33. కింది వాటిలో భారతదేశ ప్రధాన భౌగోళిక స్వరూపం కానిది ఏది?
1) ద్వీపకల్ప పీఠభూమి
2) హిమాలయాలు
3) హిందూకుష్ పర్వతాలు
4) గంగా-సింధూ నది మైదానం
34. కింది వాటిలో హిమాలయాలకు చెందనిది ఏది?
1) కారకోరం శ్రేణులు
2) హిమాద్రి శ్రేణులు
3) హిమాచల్ శ్రేణులు
4) శివాలిక్ శ్రేణులు
35. కింది వాటిలో సరికానిది ఏది?
1) హిమాద్రి శ్రేణుల సగటు ఎత్తు సుమారు 6,100 మీటర్లు
2) ఇక్కడ హిమానీనదాలు కనబడతాయి
3) హిమాద్రికి దక్షిణాన ఉన్న శ్రేణిని ‘శివాలిక్’ అంటారు
4) హిమాద్రిని ఉన్నత హిమాలయాలు అంటారు
36. కింది వాటిలో సరైంది ఏది?
ఎ. హిమాచల్ శ్రేణులను ‘నిమ్న హిమాలయాలు’ అంటారు
బి. వీటి సగటు ఎత్తు 3,700-4,500 మీటర్లు
సి. ఇవి వేసవి విడిదులకు ప్రసిద్ధి చెందినవి
డి. హిమాద్రి, నిమ్న హిమాలయాలకు మధ్య ఉన్న లోయలను ‘డూన్’లు అంటారు
1) ఎ, బి
2) బి, సి, డి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
37. కింది వాటిలో సరికానిది ఏది?
1) మిష్మి కొండలు-అరుణాచల్ ప్రదేశ్
2) కచార్ కొండలు-సిక్కిం
3) పాట్‌కాయ్ భమ్ కొండలు- అరుణాచల్ ప్రదేశ్
4) ఖాసి కొండలు - మేఘాలయా
38. ‘అంతర్వేది’ అంటే ఏమిటి?
1) రెండు కొండల మధ్య ఉండే లోయలు
2) రెండు నదుల మధ్య ఉండే ప్రాంతం
3) సముద్రంలోకి చొచ్చుకొని పోయిన ప్రాంతం
4) భూభాగాల్లోకి చొచ్చుకొని వచ్చిన జల భాగం
39. కింది వాటిలో సింధూ నదికి ఉపనది కానిది ఏది?
1) చినాబ్
2) తీస్తా
3) బియాస్
4) సట్లెజ్
40.శివాలిక్ పర్వత పాదాల వెంట ఉండే గులకరాళ్ల భాగాన్ని ఏమని పిలుస్తారు?
1) టెరాయి
2) భంగర్
3) ఖాదర్
4) భాబర్
41. శివాలిక్ శ్రేణి సగటు ఎత్తు ఎంత?
1) 1,900-2,500 మీటర్లు
2) 2,500-3,500 మీటర్లు
3) 9,00-1,100 మీటర్లు
4) 3,500-4,700 మీటర్లు
42. గంగా-సింధూ నదీ మైదానం ఎప్పుడు ఏర్పడింది?
1) 2 లక్షల సంవత్పరాల క్రితం
2) 2 మిలియన్ సంవత్సరాల క్రితం
3) 5 మిలియన్ సంవత్సరాల క్రితం
4) 2 కోట్ల సంవత్సరాల క్రితం
43. మధ్య గంగా మైదానం ఏ నదుల మధ్య విస్తరించి ఉంది?
1) తీస్తా, బ్రహ్మపుత్ర
2) సట్లెజ్, కాళీ
3) తీస్తా, సట్లేజ్
4) ఘగ్గర్, తీస్తా
44. భాబర్‌కు దక్షిణాన ఉన్న ప్రదేశాలను ఏమని పిలుస్తారు?
1) ఖాదర్
2) భాబర్
3) టెరాయి
4) భంగర్
45. కింది వాటిలో సరికానిది ఏది?
1) టెరాయి అంటే చిత్తడి నేలలు
2) భంగర్ అంటే ప్రాచీన కాలపు ఒండ్రు నేలలు
3) ఖాదర్ అంటే నవీన కాలపు ఒండ్రు నేలలు
4) ఖాదర్‌కు ఉత్తరంగా ఉన్న నేలలు టెరాయి
ANSWERS:
1)3 2)3 3)2 4)3 5)1 6)2 7)4 8)3 9)3 10)4 11)1 12)3 13)3 14)4 15)4 16)1 17)2 18)3 19)4 20)2 21)3 22)1 23)3 24)4 25)2 26)3 27)4 28)3 29)1 30)1 31)4 32)1 33)3 34)1 35)3 36)3 37)2 38)2 39)2 40)4 41)3 42)4 43)4 44)3 45)4
Please give your comments....!!!