*🔵వాలంటరీ రిటైర్మెంట్: సందేహాలు - సమాధానాలు*
*💥1. ప్రశ్న: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?*
*🎯జవాబు: వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.*
--------------------
*💥2. ప్రశ్న: వాలంటరీ రిటైర్మెంట్ ఏయే కారణాలపై తీసుకోవచ్చు?*
*🎯జవాబు: వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.*
---------------------
*💥3. ప్రశ్న: ఒక టీచరుకు జూన్ 2023 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. జూన్ తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?*
*🎯జవాబు: 20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే వాలంటరీ రిటైర్మెంట్ కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.*
*💥4. ప్రశ్న: ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?*
*🎯జవాబు: క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (61/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.*
Please give your comments....!!!