Type Here to Get Search Results !

Instructions on Out of School Children Survey

*బడి బయటి పిల్లల సర్వే*


గౌరవ విద్యా  సంచాలకులు & స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ , సమగ్ర శిక్ష , తెలంగాణ వారి ఆదేశముల మేరకు 21 జనవరి, 2025 నుండి జనవరి 31, 2025 వరకు  బడి బయటి పిల్లల సర్వే నిర్వహించి - గుర్తించిన 6-14  మరియు 15-19 సంవత్సర వయసుగల విద్యార్థులను సమీప పాఠశాలయందు నమోదు చేసి సదరు వివరములను  ప్రబంధ్ పోర్టల్ లో నమోదు చేయాలి. 

ముఖ్య సూచనలు :

1. బడిబయటి పిల్లల గుర్తింపుకు డోర్ టు డోర్ సర్వే 21 జనవరి, 2025 నుండి జనవరి 31, 2025 వరకు జరుగును. 
2. CRP లు తమ పరిధిలోని ఆవాసములవారి షెడ్యూల్ రూపొందించుకొని , ఏ ఒక్క ఆవాస గృహము కూడా వదలకుండా బడిబయటగల పిల్లల వివరములను సేకరించవలెను.  అట్టి షెడ్యూలును MEO లకు మెయిల్ చేయబడిన గూగుల్ లింక్ నందు నమోదుచేయవలెను. 
3. సర్వేకు ఇందుకు జతచేయబడిన ఫార్మాట్ను ఉపయోగించి పూర్తి వివరములను సేకరించవలెను. 
4. మీరిచ్చిన షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా ఆయా ఆవాసములందు సర్వే  జరుగుతుండవలెను.  గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖాధికారి గారు మరియు ఇతర పర్యవేక్షణాధికారులు ఫీల్డ్ పర్యవేక్షణజరిపెదరు. 
5. గౌరవ కలెక్టర్ గారు బడిబయటి పిల్లలను గుర్తించటంలో అలసత్వం వహించినా, మొక్కుబడి సర్వే జరిగిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి వున్నారు. అదేవిధంగా DRDA  శాఖను సమాంతరంగా సర్వే నిర్వహించమని ఆదేశించి యున్నారు . సదరు సంఖ్యకు-మనసంఖ్యకు తేడావున్నట్లయితే తగు చర్యలుంటాయని హెచ్చరించి ఉన్నారు. 
6. ప్రధానంగా మీ పరిధిలోని పాఠశాలల్లో 30 రోజులకు పైబడి గైర్హాజరవుతున్న విద్యార్థులు, గత విద్యాసంవత్సరము వరకు చదివి ఈ సంవత్సరం ఏ  పాఠశాలలో చేరని  డ్రాప్ అవుట్ విద్యార్థుల వివరములు ప్రధానోపాధ్యాయులనుండి సేకరించుకొనగలరు. 
7. బడిబయటి విద్యార్థులను గుర్తించటం కేవలం ప్రారంభం మాత్రమే - వారిని ఖచ్చితంగా పాఠశాల యందు నమోదు చేసి సదరు వివరములను PRABHAND పోర్టుల యందు నమోదు చేయటంతో మాత్రమే కార్యక్రమం పూర్తవుతుంది. సర్వే వివరములను  ఏ రోజుకారోజు పోర్టల్ నందు నమోదుచేయవలెను. 
8. మండల విద్యాశాఖాధికారులు , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు  & ప్రధానోపాధ్యాయులు సర్వే పగడ్బందీగా ఇవ్వబడిన షెడ్యూల్ ప్రకారం  జరిగి  అందరు బడిబయట విద్యార్థులు గుర్తించబడే విధంగా నిరంతర పర్యవేక్షణ జరుపవలెను. 
9. సర్వే అంనంతరం మండల విద్యాశాఖాధికారులు , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , ప్రధానోపాధ్యాయులు & కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ తమ పరిధిలోని అన్ని ఆవాసములు కవర్ చేయబడినవని - ప్రతి బడిబయటి విద్యార్థి గుర్తించబడి పాఠశాలలో చేర్చబడినారని  లిఖిత  పూర్వక ధ్రువపత్రము అందజేయవలసి ఉంటుంది. 
11. కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ బడిబయట పిల్లల గుర్తింపు - బడిలో చేర్చుట  మీ ప్రాధమిక బాధ్యత కావున అలసత్వము వహించరాదు. 
12. ఫోటో ల కోసం సర్వే కాకూండా సర్వే జరిగే సందర్భం లో ఒకటి లేదా రెండు ఫోటోలు మాత్రమే గ్రూప్ యందు CRP పేరు, కాంప్లెక్స్ పేరు, మండలము పేరుతో పోస్ట్ చేయగలరు. 
13. మండలస్థాయిలో  మండల విద్యాశాఖాధికారులు , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , ప్రధానోపాధ్యాయులు,  కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ & DRDA మండల స్థాయి బాధ్యులతో వెంటనే సమన్వయ సమావేశము నిర్వహించుకొనగలరు. 
14. విద్యాశాఖకు  బడిబయటిపిల్లల గుర్తింపు -నమోదు ఒక సవాలుతో కూడిన బాధ్యత కావున సంబంధితులందరు  ఇట్టి కార్యక్రమమును పూర్తి శ్రద్ధవహించి విజయవంతం చేయగలరు. 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night