Type Here to Get Search Results !

Jobs Notification in Jr Asst, Office Sub Ordinate, Computer Operator, Record Asst etc to Telangana high court, dist court, session court Complete Details in Telugu


తెలంగాణ జిల్లా కోర్టు, హైకోర్టు నుండి 1673 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల |

 Jobs Notification in Jr Asst, Office Sub Ordinate, Computer Operator, Record Asst etc to Telangana high court, dist court, session court Complete Details in Telugu


తెలంగాణాలోని జిల్లా కోర్టు, హైకోర్టు నుండి 1673 (టెక్నికల్, నాన్ టెక్నికల్) పోస్టులతో జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సభాఆర్డినేట్ , కంప్యూటర్ ఆపరేటర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎక్సమినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, కాఫీస్ట్, ఇతర పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. 7th, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.


ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తెలంగాణాలోని 33 జిల్లాల కోర్టులు, హైకోర్టులలో 1673 ఉద్యోగాలము ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.



ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ
08th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ
31st జనవరి 2025
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్లికేషన్ ప్రారంభ తేదీ
 10th ఫిబ్రవరి 2025
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్లికేషన్ ఆఖరు
 తేదీ 25th ఫిబ్రవరి 2025
 CBT/OMR ఆధారిత రాత పరీక్ష తేదీ April & June 2025

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా Ts లోని జిల్లా కోర్టులు, Ts హైకోర్టులలో పని చేయడానికి టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయడానికి 1,673 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు ఇందులో జిల్లా కోర్టుల నుండి 1277 జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎక్సమినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ పోస్టులు, నాన్ టెక్నికల్ కింద 184 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాఫీస్ట్ పోస్టులు వున్నాయి. అలాగే హైకోర్టు నుండి 212 కోర్టు మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్, ఎక్సమినర్, టైపిస్ట్, కాఫీస్ట్, సిస్టం అసిస్టెంట్, ఆఫీస్ర్డినేట్ పోస్టులు వున్నాయి.



ఎంత వయస్సు ఉండాలి:
తెలంగాణా కోర్టు ఉద్యోగాలకు Apply చేసుకోవడానికి అభ్యర్థులకు 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్, తెలుగులో పరీక్ష ఉంటుంది.



శాలరీ వివరాలు:
తెలంగాణా కోర్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి ₹45,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.


అప్లికేషన్ ఫీజు:
కోర్టు ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹600/- ఫీజు చెల్లించాలి, SC, ST, EWS, PWD అభ్యర్థులు ₹400/- ఫీజు చెల్లించాలి.
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night