Type Here to Get Search Results !

Some Frequently Asked Questions and Answers About Income Tax


*💥 _ఇన్కమ్ టాక్స్ గురించిన కొన్ని సందేహాలు సమాధానాలు_*


▪️ప్రశ్న 1:- నిన్న ప్రకటించినవి ఎప్పటి నుంచి అమలౌతాయి?


- జవాబు:- ది. 01-04-2025 నుంచి ది. 31-03-2026 మధ్య రాబోయే ఆదాయం పైన కొత్త లెక్క ప్రకారం పన్ను చెల్లించాలి.

▪️ప్రశ్న 2:- ఆర్థిక సంవత్సరం అంటే ఏమిటి? అసెస్మెంట్ సంవత్సరం అంటే ఏమిటి?


- జవాబు:- ఇప్పుడు జరిగే ఆర్థిక సంవత్సరం 2024-25. దీనికి సంబంధించి అసెస్మెంట్ ఇయర్ అనగా మదింపు సంవత్సరం 2025-26. ది. 01-04-2024 నుంచి ది. 31-03-2025 మధ్య వచ్చిన ఆదాయం ఆ ఆర్థిక సంవత్సరం కింద లెక్క. వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ అవుతుంది. అసెస్మెంట్ సంవత్సరంలో మనం విధిగా ఆదాయపు పన్ను చెల్లించాలి. కానీ శాలరీ లేదా పెన్షన్ అకౌంట్లో వేతనం పొందేవారు మార్చి 15 లోపే ముందస్తు పన్ను చెల్లింపు పూర్తి చేయాలి. ఎక్కువ తక్కువలు జులై 31 రిటర్న్ దాఖలు చేసే లోపల సరి చేసుకోవచ్చు.

▪️ప్రశ్న 3:- కొత్త విధానం అంటే ఏమిటి? పాత విధానం అంటే ఏమిటి? 


- జవాబు:- పాత విధానంలో మినహాయింపులు ఆయా సెక్షన్ల ప్రకారం ఉంటాయి. కొత్త విధానంలో మినహాయింపులు ఉండవు. 

▪️ప్రశ్న 4:- మినహాయింపులు ఉంటేనే మేలు కదా!


- జవాబు:- ఉంటే మంచిదే! పొదుపు పెరుగుతుంది. కానీ పొదుపు కన్నా, ప్రజలు ఎక్కువగా ఖర్చు చేయడం ద్వారా మార్కెట్ పెరుగుతుంది. వ్యాపారం పెరగడం వల్ల పరిశ్రమాధిపతులకు, వ్యాపారవేత్తలకి లాభాలు వస్తాయి. ప్రజల్లో పొదుపు శక్తి తగ్గుతుంది. కానీ గత పది సంవత్సరాలుగా కొత్త విధానం అమల్లోకి వచ్చింది. దాన్నే కొనసాగిస్తున్నారు.

▪️ప్రశ్న 5:- ఈ సంవత్సరం ఎంత దాటితే పన్ను పడుతుంది? రాబోయే సంవత్సరం ఎంత దాటితే పన్ను పడుతుంది?


- జవాబు:- మనం పెన్షన్ పొందుతున్నప్పటికీ, చెల్లింపు శాలరీ అకౌంట్ నుంచి జరుగుతోంది కనుక, సంవత్సరానికి 75 వేల రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ కింద అనుమతి ఉంది. కాబట్టి ఈ సంవత్సరం రూ.7,75,000 దాటితే, అంటే నెలకు రూ.64,583 దాటితే పన్ను చెల్లించవలసి ఉంటుంది. వచ్చే సంవత్సరం రూ.12,75,000 దాటితే, అంటే నెలకు రూ.1,06,250 దాటితే పన్ను పడుతుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు వుంటే ఇంకా తక్కువ పెన్షన్ వచ్చినా పన్ను పడుతుంది.

*🌼నేను 24B మరియు 80EE రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చా?* 


జ) అవును Claim చెయ్యవచ్చు. మీరు 24B మరియు 80EE తగ్గింపులను ఏకకాలంలో క్లెయిమ్ చెయ్యవచ్చు.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 మరియు సెక్షన్ 80EE రెండింటి యొక్క షరతులను సంతృప్తిపరచగలిగితే, ఏకకాలంలో రెండింటినీ క్లెయిమ్ చెయ్యవచ్చు.

ముందుగా, సెక్షన్ 24 కింద రూ. 2 లక్షల మీ మినహాయింపు పరిమితిని పూర్తి చేయండి.

ఆపై సెక్షన్ 80EE కింద అదనపు ప్రయోజనాలను క్లెయిమ్ చేయడం కొనసాగించండి.

కాబట్టి, ఈ మినహాయింపు సెక్షన్ 24 కింద అనుమతించబడిన రూ.2 లక్షల పరిమితికి అదనం.

 *నేను 24B మరియు 80EEA రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చా?* 

అవును Claim చేయవచ్చు.

మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 24 మరియు సెక్షన్ 80EEA రెండింటి యొక్క షరతులను సంతృప్తిపరచగలిగితే,

మీరు రెండు సెక్షన్ల క్రింద ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.

 *Maximum Limit (Section wise)* 

24B: 2,00,000 Rs.

80EE: 50,000 Rs.

80EEA: 1,50,000 Rs.



 * 80EE & 80EEA రెండింటినీ క్లెయిమ్ చేయవచ్చా?* 


లేదు Claim చెయ్యలేరు. మీరు 80EE మరియు 80EEA తగ్గింపులను ఏకకాలంలో క్లెయిమ్ చేయలేరు.

ఈ తగ్గింపులకు అర్హత హోమ్ లోన్ పొందిన కాలంపై ఆధారపడి ఉంటుంది.

కాబట్టి, మీరు ఇప్పటికే ఒక విభాగం కింద మినహాయింపును క్లెయిమ్ చేసి ఉంటే, మీరు మరొకదానిని క్లెయిమ్ చేయలేరు.
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night