1. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ప్రత్యేకతలు:
a) ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి.
b) ఈ విద్యాలయాలు పూర్తిగా గురుకుల విధానంలోనే విద్యను అందిస్తున్నవి మరియు విద్యాలయాలు అన్నియు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో నిర్వహించబడుచున్నవి.
c) ఈ విద్యాలయాలలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించబడును.
d) ఈ విద్యాలయాలలో మంచి మౌళిక వసతులతో కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడాప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయి.
e) విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కొరకు, విద్యతో పాటుగా, సహ పాఠ్యాంశాలు మరియు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
f) ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు లోకో పేరెంట్ గా నియమించబడును. వీరు ప్రతి విద్యార్ధి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకొనెదరు.
g) దైనందిన కార్యక్రమాలు ఉదయం గం. 5 లకు శారీరక వ్యాయామంతో ప్రారంభమై, బోధనా తరగతులు మరియు ఇతర అభ్యసన కార్యక్రమాలు రాత్రి గం. 9.00 వరకు కొనసాగుతాయి.
h) విద్యార్థులకు గణిత ఒలింపియాడ్, హిందీ ప్రచార సభ, ఇండియా స్కిల్స్ జూనియర్, సైన్స్ ఫెయిర్ మరియు NTSE మొదలైన ప్రతిష్ఠాత్మక పరీక్షల కొరకు తర్పీదు ఇవ్వబడును.
i) ఉత్తమ మరియు మంద అభ్యాసకుల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడును.
5. అర్హతలు:-
a) విద్యార్థినీ విద్యార్థులు భారతపౌరులై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండవలెను.
b) 5 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023-24 విద్యాసంవత్సరంలో 3వ తరగతి చదివి, 2024-25 విద్యాసంవత్సరంలో 4 వ తరగతి చదువుతూ ఉండవలెను. ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2014 నుండి 31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2016 మధ్య పుట్టి ఉండాలి.
c) 6 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2013 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2015 మధ్య పుట్టి ఉండాలి.
d) 7 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2012 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి.
మరియు యస్.టి. (SC & ST) లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2014 మధ్య పుట్టి ఉండాలి.
e) 8 వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరంలో 7 వ తరగతి చదివి ఉండాలి.ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC & ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
f) జనరల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఓ.సి., బి. సి. మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.
g) యస్.సి. మరియు యస్.టి. విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.
h) మైనారిటీ విద్యార్థులు, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివి ఉండవచ్చును.
i) ఆదాయపరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల (2024-25) ఆదాయం 1,00,000/- లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు.
j) సైనికోద్యోగుల పిల్లలకు ఆదాయపరిమితి నియమం వర్తించదు.
6. దరఖాస్తు చేసుకొనుటకు మార్గదర్శకాలు :
a) జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేయగోరు అందరు అభ్యర్థులు తప్పక APRS CAT-2025 వ్రాయవలెను.
b) మైనారిటీ పాఠశాలల్లోని, మైనారిటీ కేటగిరి సీట్లు కూడా ప్రవేశ పరీక్ష (APRS CAT-2025) ద్వారా భర్తీ చేయబడును. ప్రవేశం పొందగోరు విద్యార్థులు APRS CAT-2025 తప్పక వ్రాయవలెను.
c) అభ్యర్థులు దరఖాస్తులను నింపుట కొరకు https://aprs.apcfss.in వెబ్ సైట్ ను సందర్శించవలెను.
d) అభ్యర్థులు దరఖాస్తులను నింపుటకు ముందు వెబ్ సైట్ నందలి నియమావళిని జాగ్రత్తగా చదువుకొని తమ అర్హతల పట్ల సంతృప్తి చెందిన తరువాత మాత్రమే దరఖాస్తులను నింపవలెను
e) అభ్యర్థి అర్హత ప్రమాణాల గురించి సంతృప్తి చెందిన తర్వాత, రుసుము చెల్లింపు లింక్ని క్లిక్ చేయడం / తెరవడం ద్వారా రూ.100/- రుసుమును పేర్కొన్న వ్యవధిలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలి.
f) ఆన్లైన్లో ఫీజు చెల్లింపు సమయంలో, అభ్యర్థి అవసరమైన ప్రాధమిక వివరాలను అనగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్ మొదలైనవి ఇవ్వవలెను.
9) ఒక మొబైల్ నంబర్ను ఒక అప్లికేషన్ కోసం మాత్రమే ఉపయోగించవలెను. ఇవ్వబడిన మొబైల్ నెంబర్, OTP ద్వారా నిర్ధారించబడుతుంది.
h) ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాత, అభ్యర్థి ID జారీ చేయబడుతుంది. అభ్యర్థి ID జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ID, రుసుము రసీదుకి సంబంధించిన నిర్ధారణ మాత్రమే.
i) ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు అభ్యర్థి 3.5 X 4.5 సెంటీమీటర్ల పరిమాణంలో ఫోటో మరియు సంతకంతో సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు ఫారమ్తో పాటు ఫోటో & సంతకాన్ని కలిపి స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
j) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి, అప్లికేషన్ ఫారమ్ లింక్పై క్లిక్ చేసి, అభ్యర్థి ID మరియు పుట్టిన తేదీతో లాగిన్ చేయవలెను. పిదప ఆన్లైన్ అప్లికేషన్ తెరవబడుతుంది.
k) ఆన్లైన్ దరఖాస్తును పూరిస్తున్నప్పుడు, తరగతిని జాగ్రత్తగా ఎంచు కోవలెను. ఎంచుకున్న తరగతిని తర్వాత మార్చలేరు.
1) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించేటప్పుడు (PHC/CAP/ORPHAN మినహా) ఇతర ఎటువంటి ధృవపత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు. కానీ, ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో దరఖాస్తులో అందించిన సమాచారానికి తగిన ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించగలగాలి. (PHC/CAP/ORPHAN విద్యార్థులు ఈ కేటగిరి లకు సంబంధించిన SADAREM సర్టిఫికేట్ / CAP సర్టిఫికేట్/ ఎం ఆర్ ఓ జారీ చేసిన అందధ సర్టిఫికేట్ లు అప్ లోడ్ చేయవలెను. అనాధ కేటగిరి అనగా తల్లి తండ్రి ఇద్దరు లేని విద్యార్థులు మాత్రమే పరిగణింపబడును.
m) దరఖాస్తులో అభ్యర్థి తన కులం / కేటగిరిని తప్పుగా నమోదు చేసి, మరొక కేటగిరిలో ఎంపిక కాబడినచో ప్రవేశం ఇవ్వబడదు మరియు కులం / కేటగిరి మార్చబడదు.
n) ఎలాంటి లోపాలు లేకుండా వివరాలను జాగ్రత్తగా పూరించాలి. ఏదైనా తప్పులు/తప్పుడు సమాచారం సమర్పించినట్లయితే, దరఖాస్తు / అడ్మిషన్ తిరస్కరణకు అభ్యర్థి పూర్తిగా బాధ్యత వహించవలసి వుంటుంది.
o) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి తదుపరి అవసరముల కోసం దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింట్ను తీసుకోవాలి.
11. ముఖ్యమైన తేదీలు:
a) ప్రెస్ నోటిఫికేషన్ తేదీ: 01.03.2025
b) ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01.03.2025
c) ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 31.03.2025
d) హాల్ టిక్కెట్ల జారీ తేదీ : 17.04.2025
e) పరీక్ష తేదీ : 25.04.2025
(ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు)
1) ఫలితాల ప్రచురణ & మొదటి ఎంపిక జాబితా తేదీ : 14.05.2025
g) రెండవ ఎంపిక జాబితా (Probable) తేదీ : 30.05.2025
h) మూడవ ఎంపిక జాబితా (Probable) తేదీ : 13.06.2025
Please give your comments....!!!