Type Here to Get Search Results !

FAQs Frequently Asked Questions on Pension Rules

View as Night
*📡పెన్షన్ రూల్స్ పై ప్రశ్నలు-జవాబులు.✍️*
     
*ప్రశ్న:*
20 సంవత్సరాల Qualifying Service చేసిన తరువాత రిటైర్ కావాలంటే పాటించవలసిన నిబంధనలు తెలపండి? 
*✅జవాబు:*
(1) ఏ రోజు రిటైర్ కావాలనుకున్నారో దానికంటే 3 నెలల ముందు నోటీసు/అప్లికేషన్ ఇవ్వాలి. 
(2) రూలు 8,9,10 లోబడి మంజూరు చేస్తారు.
(3) 20 సంవత్సరాలు లెక్కించడానికి E.O.L on any Purpose, Including M.C. except E.O.L for Prosecuting higher studies మినహాయించాలి.
(4) సంబంధిత అధికారి నోటీసు పీరియడ్ ముగియక ముందే అతని విన్నపాన్ని ఆమోదించామని లేక తిరస్కరించామని తెలపాలి.
(5) ఈ విధంగా రిటైర్మెంటు ఆమోదం పొందిన వారికి 5 సంవత్సరాలకు మించకుండా సర్వీసు వెయిటేజీ కలుపుతారు. 
(6) వీరికి తిరిగి Rule 29 ప్రకారం ఇచ్చే వెయిటేజీ వర్తించదు.
రూలు 43 (1) నుండి (7) వరకు.
•••••••••

*ప్రశ్న:*
20 సంవత్సరాల Qualifying service చేసిన తరువాత రిటైర్మెంటుకు ఆమోదం పొందిన వారికి వెయిటేజీ ఎలా కలుపుతారు? 
*✅జవాబు:*
 (1) రిటైర్మెంట్ on superannuation కు మిగిలి వున్న సర్వీసు.
 (2) 5 సంవత్సరాలు. 
 పై రెండింటిలో ఏది తక్కువ అయితే అది పరిగణలోనికి తీసుకొని 33 సంవత్సరాలకు మించకుండా చూసుకోవాలి. 
 రూలు - 43 (5). 
•••••••••

*ప్రశ్న:*
ఉదా: - ఒక ఉద్యోగి సహజంగా 30-11-2030 రిటైర్ కావాలి కాని అతనికి రూలు 43 ప్రకారము 30-11-2024లోనే రిటైర్మెంట్‌కు Permission ఇచ్చారు. అతనికి కలిసే వెయిటేజీ ఎంత. అతని మొత్తం Qualifying service 29 సంవత్సరాలు. 
*✅జవాబు:*
సహజంగా ఇంకా మిగిలివున్న సర్వీసు = 30-11-2030 - 30-11-2024 = 0-0-6 సంవత్సరాలు.
రూలు 43 ప్రకారం మొత్తం వెయిటేజ్ 5 సంవత్సరాలు.
కాని 33 సంవత్సరాల Qualifying service కొరకు తగ్గిన కాలము 33-29 = 4. 
అతనికి కలుపు వెయిటేజీ - 4 సంవత్సరాలు.
•••••••••
*ప్రశ్న:*
ఫుల్ టైం కంటింజెంట్ ఎంప్లాయిగా పనిచేసి నాల్గవ తరగతి ఉద్యోగులుగా మారిన వారికి 20 సంవత్సరాలు క్వాలి పైయింగ్ సర్వీస్ లెక్కించి రిటైర్ చేయడానికి కంటింజెంట్ ఎంప్లాయిగా పనిచేసిన సర్వీసుకు పరిగణిస్తారా? 

*✅జవాబు:*
పరిగణిస్తారు. 
రూలు 43. 
Executive Instruction (ii) (b) 
GO.Ms.No. 19642-E/CC/Pension-1/91, dt. 23-7-1992 of Fin & Plg. Dept.,
•••••••••

*ప్రశ్న:*
20 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీసు పూర్తి అయిన తరువాత రిటైర్ మెంటు చేయమని ఉద్యోగి ఇచ్చిన నోటీసుపై ఎంతకాలంలో నిర్ణయం తీసుకోవాలి? 
*✅జవాబు:*
వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. 
రూలు 43 
Executive Instruction (iii) 
Cir.Memo.No.23915/483/PC-1/86, dt. 2-5-1988 of Fin.& Plg. Dept.,

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.