ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు ఎఫ్ ఎల్ ఎన్ తొలి మెట్టు పరీక్ష మరియు ఆరో తరగతి నుండి 9వ తరగతి చదివే విద్యార్థులకు లిప్ పరీక్షలు మార్చి నెల లో నిర్వహించాల్సి ఉంది వీటి యొక్క ఫలితాలు మార్చి 31 వ తారీఖు నాడు ఫోన్ యాప్ లో నమోదు చేయాల్సి ఉంది
2. FLN End Line Question Papers All Subjects from 1st to 5th Classes English Medium Click here to Download Pdf
3. LIP End Line Question Papers All Subjects from 6th to 5th Classes Telugu Medium Click here to Download Pdf
4. LIP End Line Question Papers All Subjects from 6th to 5th Classes English Medium Click here to Download Pdf
*FLN మరియు LIP ఎండ్ లైన్ పరీక్ష ( 1 నుండి 9 తరగతులకు) సూచనలు*
జిల్లా లోని అందరు మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మరియు ప్రాధమిక / ప్రాధమికోన్నత /ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, TSRIES/మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్, KGBV/URS SOs, ఉపాధ్యాయులు,కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్ , MIS & CCO కు ముఖ్య సూచనలు....
ప్రభుత్వ/స్థానిక సంస్థ/TGMS/KGBVలు/TGREIS/అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో అభ్యాసన అంతరాలను తొలగించటానికి మరియు విషయ-నిర్దిష్ట అభ్యాసన ఫలితాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన FLN & LIP అమలు చేయబడుతున్నాయి.
2024-25 విద్యా సంవత్సరంలో FLN మరియు LIP అమలులో భాగంగా, బేస్ లైన్ మరియు మిడ్‌లైన్ పరీక్షలు ఇప్పటికే నిర్వహించబడినాయి. ఇప్పుడు ఎండ్-లైన్ పరీక్ష నిర్వహించబడుతుంది మరియు పిల్లల పురోగతిని మార్చి 31, 2025 నాటికి తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
FLN మరియు LIP యొక్క ఎండ్ లైన్ పరీక్ష ప్రశ్నాపత్రాల సాఫ్ట్ కాపీలను జిల్లాలోని అందరు మండల విద్యాధికారులకు 18./03/2025 11 AM వరకు మెయిల్ చేయబడతాయి మరియు వాటిని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, TGMS, TGREIS, KGBVS మరియు అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల HMలు/ప్రిన్సిపల్స్/SOలకు తెలియజేయవచ్చు. వారు ప్రశ్నపత్రముల గోప్యతను పాటిస్తూ గడువు లోపు నిర్దేశించబడిన అన్ని కార్యక్రమములు పూర్తి చేయవలసినదిగా ఆదేశించబడుచున్నారు.
FLN మరియు LIP యొక్క ఎండ్-లైన్ పరీక్షను నిర్వహించడానికి మరియు ఫలితాలను తెలంగాణ ఎడ్యుకేషన్ యాప్‌లో అప్‌లోడ్ చేయడానికి సంబంధితులందరు వ్యక్తిగత శ్రద్ధను చూపి 31/03/2025 నాటికీ పరీక్షల నిర్వహణ మరియు పిల్లల పురోగతిని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌లో అప్లోడ్ చేయవలెను.
విద్యార్థుల అభ్యాసన ప్రగతిని విశ్లేషించడానికి మరియు నిర్ధారించడానికి ప్రతి పాఠశాలలో ఈ మూడు పరీక్షల(బేస్లైన్, మిడ్ లైన్ & ఎండ్ లైన్ ) సగటును తీసుకున బడుతుంది కావున ప్రతి విద్యార్థి యొక్క మూడు FLN & LIP పరీక్షల ప్రదర్శనను తప్పక 31/03/2025 నాటికీ 100% నమోదు చేయవలెను.
ఇట్టి విషయములో ఏవిధమైన వెనుకబాటు ఉపేక్షించబడదు.
Please give your comments....!!!