*గణితశాస్త్ర పరీక్ష రాసేటపుడు గుర్తుంచుకోవలిసిన ముఖ్యమైన అంశాలు*:
* పరీక్షను సులభంగా చేయగలను అనే ఆత్మవిశ్వాసం తో పరీక్ష కేంద్రంలోకి వెళ్ళండి
* పేపర్ తీసుకోగానే ఇన్విజిలేటర్ గారు ఇచ్చే సూచనలను పాటించి జాగ్రత్తగా ప్రాథమిక అంశాలు పూర్తిచేసుకోండి
* పూర్తి పేపర్ ను క్షుణ్ణంగా రెండు సార్లు చదవండి, రెండవ సారి చదివినపుడు పేపర్ పై అవగాహన వస్తుంది.
* సులభ సమస్యలను మొదటగా సాధించి కష్టమైన సమస్యలను తరువాత సాధించండి. సరైన సెక్షన్ , ప్రశ్న సంఖ్య వేయండి.
* ప్రతి సమస్యను సాధించే ముందు దత్తంశం
(సమస్యలో ఇవ్వబడినది, సాధించవలసింది) రాయండి.
* సమస్యకు తగిన పటం ఉంటే పెన్సిల్ తో గీయండి , సూత్రం రాసి తగిన పద్దతిలో సమస్యను సాధించండి.
* సమస్యను సాధించే క్రమంలో తప్పు జరిగితే చిన్నగా ఆ తప్పుపై గీత గీయండి, మీరు సాధారణంగా చేసే కొట్టివేతలు చేయకండి.
* సమస్య సాధనలో వాడిన సూత్రమును,చివరగా వచ్చిన ఆన్సర్ ను బాక్స్ లో ఉంచండి.
* రాని సమస్యలను కూడా చివరగా తప్పకుండా ఎంతో కొంత ప్రయత్నం తో చేయండి. వదిలేసే కన్నా ప్రయత్నించి కనీస మార్కులయినా పొందవచ్చు.
* అదనపు సమస్యలకు సమాధానములు చివరగా రాయండి (ఒకవేళ సమయం ఉంటే )
* గ్రాఫ్ పేపర్ పై ప్రశ్న సంఖ్య ను వేయండి, గ్రాఫ్ ను అదనపు సమాధాన పత్రాలకు చివరగా (ఆబ్జెక్టివ్ పేపర్ కంటే ముందుగా) కట్టండి.
* గ్రాఫ్ కు సంబంధించిన సమస్యకు సమాధానం తెలియకుంటే కనీసం గ్రాఫ్ పై X-అక్షం, Y-అక్షం గీసి స్కేల్ రాసి విలువలను గుర్తిస్తే కనీస మార్కులయినా పొందవచ్చు.
* ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించే క్రమంలో కొట్టివేతలు, దిద్దడం చేయకండి. జాగ్రత్తగా సమాధానాలు గుర్తించండి.
* ఆబ్జెక్టివ్ సమాధానాలు చేసే క్రమంలో తప్పు జరిగితే దానిని వృత్తంలో చుట్టి పక్కన సరైన సమాధానం రాయండి ఇలా ఒకటి,రెండు మాత్రమే. [ఇది కూడా పేపర్ దిద్దే ఉపాధ్యాయుని పై ఆధారపడి ఉంటుంది ] కావున వీలైనంత వరకు ఒకేసారి సమాధానం రాయండి.
* పరీక్ష సమయం ముగిసేకన్నా 10 నిమిషాల ముందే ఒకసారి పూర్తిగా పేపర్స్ చెక్ చేసుకొని సరైన క్రమంలో కట్టండి.
* OMR షీట్, సమాధాన పత్రాల క్రమం కు సంబంధించి తదితర ప్రాథమిక, చివర చేసే అంశాలపై అనుమానాలను ఇన్విజిలేటర్ ని అడిగి నివృత్తి చేసుకోండి.
*FAREED ZAKARIA*
MISSION
MATHEMATICS
Please give your comments....!!!