Type Here to Get Search Results !

Instructions to SSC Students who are going to write SSC Exams in Telugu

*10 వ తరగతి విద్యార్ధులకు తెలియజేయునది ఏమనగా...*
 ❈─────✡️────── ❈
         
1. ప్రతి రోజు రాత్రిపూట 10 గంటల దాక చదవండి.

2. తెల్లవారు ఝామున 4.30 లకు నిద్రలేవండి.

3. మనసులో ఆందోళన లేక ప్రశాంతం గా వుండండి.

4. ఎట్టి పరిస్థితులలోను రాత్రి పూట నిద్రాభంగం కానివ్వకండి.

5. ఉదయం 4.30 to 6.30 వరకూ చదవండి. మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ చేయండి

6. ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి.

7. అరగంట కాల కృత్యాలకు, స్నానానికి కేటాయించండి.

8. తర్వాత పుస్తకం (main points) తిరగెయ్యండి

9. పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి.

10. ఉదయం 8.30 కల్లా దూరం వారు, 8.45 కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి. 8:30 నుండి తొమ్మిదిన్నర వరకు గంట సేపు ఎవరితో మాట్లాడకండి పుస్తకం చదవకండి

11. 8.50 కల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోండి. తోటి విద్యార్థులతో మాట్లాడకండి

12. ప్రశాంతం గా పరీక్ష హాలు లోకి చిరునవ్వుతో వెళ్ళండి.

13. ఉపాధ్యాయులు (Invigilators) చెప్పే సూచనలు గమనించండి.

14. జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి.

15. ప్రశ్నాపత్రం క్షుణ్ణంగా చదవండి.

16. బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి.

17. తప్పులు,కొట్టివేతలు లేకుండా వ్రాయండి.

18. రాసేటప్పుడు,ప్రశ్న నెంబరు,సెక్షన్ రాయండి.

19. జవాబు అవ్వగానే గీత కొట్టండి.

20. మరొక ప్రశ్నకు ఉపక్రమించండి.

21. ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా వ్రాయండి.

22. చివరకు,తెలియని ప్రశ్నలు , ఛాయస్ ట్రై చేయండి.

23. గుర్తు రాకపోతే చిరునవ్వుతో మూడుసార్లు ఊపిరి పూర్తిగా పీల్చుకొని వదలండి స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది మర్చిపోయిన విషయాలు గుర్తొస్తాయి

24. చివరి 15 నిముషాలు వ్రాసిన పేపర్ ని ఒకసారి పరిశీలించండి.

25. తప్పులు,ప్రశ్న నెంబర్లు సరి చూడండి.

26. బిట్ పేపర్ ఇవ్వగానే దారం తో కట్టండి.

27. ముందు తెలిసినవి వ్రాసి, చివరగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి.

28. వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి. అన్ని పరిశీలించాక తృప్తి గా బయటకు రండి.

29. జరిగిన పరీక్షలలో పొరబాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేళ్ళాడకండి.. నీ స్నేహితులతో అసలు మాట్లాడకండి

30. నేరుగా ఇంటికి వెళ్లి లంచ్ చేసి,ఒక గంట నిద్రించండి.

31. తరువాత రెండు గంటల వ్యవధిలో మధ్య మధ్య లో 15 నిముషాలు గ్యాప్ ఇస్తూ చదవండి.

32. బొమ్మలు,మ్యాప్ , గ్రాఫ్ పేపర్ మీద పెన్ ఉపయోగించకండి.

33. బుద్దిమంతులుగా ఉండండి.కాపీ అనే ఆలోచన మనసులోకి రానీయకండి.

34. చక్కని జయాన్ని అందుకుని - అమ్మ, నాన్నల మరియు మీ ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చండి.

 *జయం మీదే👍🏻*
All the Best👍
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night