యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో ఇస్రో వారి కార్యక్రమం
*9వ తరగతి విద్యార్థులకు యువిక కార్యక్రమం*
@ఇస్రో ఆధ్వర్యంలో యువ విజ్ఞాన్ కార్యక్రమం 2025.
@భావి భారత శాస్త్రవేత్తల తయారీకి చక్కటి అవకాశం.
@ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
@ఫిబ్రవరి 24నుంచి మార్చి 23, 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.
## *భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO )* పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ లను తయారు చేయాలని ఉద్దేశంతో యువ విజ్ఞాన్కా ర్యక్రమం(యువికా )* 2025 పేరిట ఈ కార్యక్రమాన్ని 2019 నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. పాఠశాల విద్యార్థులకు అంతరిక్ష సాంకేతికత ,అంతరిక్ష శాస్త్రం పై అవగాహన, వాటిని నిజ జీవితంలో ఉపయోగించుకోవడం వంటి ప్రాథమిక జ్ఞానం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. యంగ్ సైంటిస్టుల పేరిట ఈ కార్యక్రమం కోసం ఫిబ్రవరి 24 ,2025నుండి మార్చి 23,,2025వ తేదీ వరకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు *ఆన్లైన్లో దరఖాస్తుల* ను స్వీకరిస్తున్నది. అన్ని యాజమాన్యాలలో చదువుతున్న విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము
*దరఖాస్తు చేయు విధానం:*
# అధికారిక ఇస్రో వెబ్సైట్లో(www.isro.gov.in)(https://jigyana.iirs.gov.in/yuvika) దరఖాస్తు చేసుకోవచ్చు.
#దీన్ని ఓపెన్ చేసిన తర్వాత యువిక ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
#విద్యార్థికి సంబంధించిన వివరాలను పూర్తి చేయాలి. మెయిల్ ఐడి కి ఒక లింక్ వస్తుంది.
#విద్యార్థి స్పేస్ క్విజ్ లో పాల్గొనవలసి ఉంటుంది.
# *విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో పూర్తి చేయాలి*.
#విద్యార్థులు 2025 జనవరి 1వ తేదీ నాటికి తొమ్మిదో తరగతి చదువుతూ ఉండాలి.
#విద్యార్థి ఇంతకుముందు సాధించిన సర్టిఫికెట్స్ అన్నింటిని స్కాన్ చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది
*ఎంపిక విధానం*
- 8వ తరగతిలో వచ్చిన మార్కులను 50 శాతంగా తీసుకుంటారు. ఆన్లైన్ క్విజ్ ప్రతిభకు 10%, ఇంతకుముందు పాల్గొన్న జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి సైన్స్ ఫెయిర్ లకు 10% వరకు,, ఒలంపియాడ్ లో పాల్గొన్న వాటికి ఐదు శాతం వరకు, స్పోర్ట్స్ లో పాల్గొన్న వాటికి ఐదు శాతం వరకు, స్కౌట్ అండ్ గైడ్స్ /NCC/NSS వాటికి ఐదు శాతం మరియు గ్రామీణ ప్రాంతాలలో చదువుతున్న విద్యార్థులకు 15% తీసుకొని ఎంపిక చేయడం జరుగుతుంది.
*ముఖ్యమైన తేదీలు*
## *ఫిబ్రవరి 24 నుండి మార్చి 23,,2025 వరకు దరఖాస్తుల స్వీకరణ*.
## *ఏప్రిల్ 7 న,2025నాడు ఎంపికైనా జాబితా విడుదల*.
## *మే 19 నుండి మే 30, 2025* వరకు రెండు వారాల వరకు *ఏడు కేంద్రాల* లో ఎంపికైన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది.
#ఈ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకు
*ఇస్రోకు చెందిన ఏడు కేంద్రాలు*
1) SAC ...అహ్మదాబాద్,
2)IIRS.... డేహరాడూన్,
3)SDSC... శ్రీహరికోట,
4)VSSC ..తిరువానంతపురం
5)URS.. .బెంగుళూర్,
6)NE -SAC..శిల్లాంగ్ &
7)NRSC... హైదరాబాద్ తదితర కేంద్రాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
@@యువికా కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకు అంతరిక్షం సాంకేతికత, అంతరిక్ష శాస్త్రం పైన అవగాహన, అంతరిక్ష శాస్త్ర అనువర్తనాలపైన ప్రాథమిక జ్ఞానం అందించడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ చర్చా వేదికల్లో పాల్గొంటారు. అంతరిక్ష కేంద్రాల్లోని ప్రయోగశాల సందర్శన మరియు అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశం, ముఖాముఖి చర్చలు, రాకెట్ ప్రయోగాల సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు.
*DEO గారి సందేశం:*
ఇస్రో వారు చేపట్టిన ఈ చక్కటి కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి లోపల ఉన్న ప్రతిభను వెలికి తీసి భావి భారత పౌరులుగా తయారు కావడానికి ఇది మంచి అవకాశం... కావున ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకొని ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకునే విధంగా చూడగలరు.
పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి గారిని సంప్రదించగలరు.
Note:ISRO-YUVIKA
గైడ్ లైన్స్ వారి websites చూడగలరు.
Please give your comments....!!!